Thursday, March 13, 2025

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు

- Advertisement -
- Advertisement -

11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం
ఈనెల 27న పోలింగ్, మార్చి 3న ఫలితాల వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనున్నది. వచ్చిన నామినేషన్లు ఈనెల 11వ తేదీన పరిశీలిస్తారు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27వ తేదీన ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. మార్చి మూడో తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా, వీటిలో ఒకటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానం కాగా, మిగతా రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి మరొక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి జీవన్ రెడ్డి ఈసారి బరిలో లేకపోవడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీచేస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, నర్సిరెడ్డిలతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పోటీచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News