Sunday, April 13, 2025

రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్ధిష్ట గడువును నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మ క తీర్పు వెలువరించింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 2020 నుం చి పెండింగ్‌లో ఉంచడం, మూడేళ్ల తరువాత 2023లో రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కో ర్టు నాలుగు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో పెట్టిన బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవలసిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని స్పష్టం చేసింది.

415 పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి 10.54 గంటలకు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వం లోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందులో ఏదైనా జాప్యం జరిగితే దానికి కారణాలను ఆయా రాష్ట్రాలకు రాష్ట్రపతి భవన్ వివరించాల్సి ఉంటుందని తెలియజేసింది. నిర్దేశిత గడువు లోగా రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది. మాండమస్ రిట్ అంటే సంబంధిత సంస్థ లేదా ప్రభుత్వ అధికారి తన చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించాలని కోర్టు ద్వారా ఆదేశించడం. ఆర్టికల్ 201లో నిర్దేశిత గడువు లోటును సరిచేస్తూ సర్కారియా కమిషన్ (1983), ఫుంచి కమిషన్ (2007) సిఫార్సులను ఆధారంగా చేసుకుని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి మూడు నెలల గడువు విధించడం గమనార్హం. ఒకవేళ బిల్లు గాని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఆర్టికల్143 ప్రకారం సుప్రీం కోర్టుతో రాష్ట్రపతి సంప్రదించపులు జరిపే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News