Monday, December 23, 2024

టీమిండియా కోచ్ పదవి దరఖాస్తుకు ముగిసిన గడువు

- Advertisement -
- Advertisement -

ముంబై:  టీమిండియా హెడ్ కోచ్ పదవికి గడువు సోమవారంతో ముగిసింది. అయితే, రాహుల్ ద్రావడ్ తరువాత టీంకు మార్గదర్శిగా నిలిచేది ఎవరన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కోచ్ పదివికి తొలుత పలువురు విదేశీ క్రికెట్ దిగ్గజాలు లైన్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఆస్ట్రేలియా లెజెండ్  రికీ పాంటింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, దేశీయంగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారికోసమే తాము చూస్తున్నట్టు జై షా స్పష్టం చేయడంతో ఈ వార్తలకు ముగింపు పడింది.

టీం ఇండియా హెడ్ కోచ్ గా దాదాపు 10 నెలలు టీం కోసం కేటాయించాలి. కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో వివిఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చినా ఆయన కూడా తప్పుకున్నట్టు సమాచారం.

మరోవైపు, ఐపిఎల్ ట్రోఫీతో తన సత్తా చాటిన గౌతమ్ గంభీర్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే, దీనిపై బిసిసిఐగానీ గంభీర్ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. గౌతమ్ కి మించిన ప్రత్యామ్నాం ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదన్న క్రీడా ప్రపంచంలో వినిపిస్తున్న మరోటాక్.

మరోవైపు, కెకెఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌కు గౌతమ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. కాబట్టి, కెకెఆర్ ను  వీడటం గౌతమ్ కి అంత ఈజీ కాదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాహుల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గౌతమ్ తగిన వాడన్న విషయంలో టీం సీనియర్ల అభిప్రాయం ఏమిటనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News