Monday, December 23, 2024

ప్రాణాంతకం….అయినా వదిలేది లేదు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: సులభ సంపాదన కోసం కొందరు వ్యాపారులు దేనిని వదలడంలేదు. తమకు డబ్బులు వస్తే చాలు ఎవరు ఎక్కడ పోతే మాకేంటి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుండడంతో కొన్ని సిగరేట్లను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. వాటిని తెలంగాణ రాష్ట్రంలో తాగడం, విక్రయించడం నిషేధం. కానీ కొందరు వ్యాపారులు దీనిని తమ సులభ సంపాదనకు అస్త్రంగా వాడుకుంటున్నారు. వాటిని తక్కువ ధరకు లభించే చోట నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లోని పలువురికి విక్రయిస్తున్నారు.

ఫాన్ షాపులు, కిరాణా షాపుల వారికి వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నగరంలో విచ్చల విడిగా ఈ సిగరేట్లు, నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్నారు. వీటిని దేశంలోని వేరే నగరాల నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరం నడిబొడ్డున ఉన్న గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. విక్రయించే వారు ఇవి చాలా ఖరీదైన సిగరేట్లని, చాలా తక్కువగా దొరుకుతాయని చెప్పి అధిక ధరలకు స్మోకింగ్ ప్రియులకు కట్టబెడుతున్నారు. గతంలో కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్‌కు చెందిన చాలా ఛీఫ్ సిగరేట్లను కొనుగోలు చేసి తీసుకుని వచ్చి విదేశీ సిగరేట్లుగా నమ్మించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సిగరేట్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాటిని హైదరాబాద్‌కు కొందరు వ్యాపారులు తీసుకుని వచ్చి విదేశీసిగరేట్లుగా విక్రయించారు,

పోలీసులు వా రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తా జాగా నిషేధిత సిగరేట్లను విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి భారీ ఎత్తున సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పారిస్ బ్రాండ్ సిగరేట్లను బేగంబజార్‌కు చెందిన వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమే కాకుండా, తాగే వారు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. ఈ విషయం తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాన్‌షాపులు, కిరాణా షాపుల వారికి విక్రయించడమే కాకుండా తన గోదాంలో పెద్ద ఎత్తున్న పారిస్ బ్రాండ్ సిగరేట్లను నిల్వ చేశాడు. ఇలా సులభంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, పోలీసులు నిఘా పెట్టి వారిని అరెస్టు చేస్తున్నా కూడా మానడంలేదు. అలాగే ఈ సిగరేట్లు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది,

ఇందులో కలిపే వివిధ రకాల కెమికల్స్ వల్ల ఆరోగ్యం తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఈ సిగరేట్ల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించింది, సులభ సంపాదన కోసం చాలామంది వ్యాపారులు ఈ సిగరెట్లను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా యువకులను లక్షంగా చేసుకుని ఈ సిగరేట్లను విక్రయిస్తున్నారు. ఇందులో వాడే రకరకాల ఫ్లేవర్ల కోసం యువకులు వాడుతున్నారు. దీనికి ఒక్కసారి బానిసగా మారితో విడిచిపెట్టరు, దీనిని అవకాశం తీసుకుంటున్న వ్యాపారులు వాటి విక్రయాలు హైదరాబాద్ నగరంలో విచ్ఛలవిడిగా చేస్తున్నారు.
ఢిల్లీ కేంద్రంగా….
నిషేధిత సిగరేట్ల దందా మొత్తం ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోంది, చాలా వరకు నిషేధిత సిగరేట్లను ఢిల్లీ కేంద్రంగా ఉండే వ్యాపారులు తయారు చేయించి రాష్ట్రాల్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారి ఢిల్లీకి వెళ్లకుండా ఫోన్‌లో మాట్లాడి ఆర్డర్ ఇస్తే చాలు అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టులో సిగరేట్లను పంపిస్తున్నారు. తక్కువ ధరకు ఢిల్లీలో కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయించి లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. యువకులు సిగరేట్లను తాగేందుకు చూపిస్తున్న ఆసక్తిని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సిగరేట్ తాగే చాలా మంది ప్రభుత్వం నిషేధించిన సిగరేట్‌లో ఏదో ఉందనే క్రేజీతో తాగేందుకు మొగ్గుచుపుతున్నారు. దీనిని వ్యాపారులు ఆసరాగా చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి సిగరేట్లను పెద్ద ఎత్తున తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News