Wednesday, January 22, 2025

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. అంటుకుంటే 24 గంటల్లో మనిషి మరణం

- Advertisement -
- Advertisement -

బురుండ: ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ వెలువడింది. దీని ప్రభావంతో మనిషి ముక్కులో నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగి, వైరస్ సోకిన వ్యక్తి 24 గంటల వ్యవధిలో చనిపోతున్నట్లు నిర్థారణ అయింది. పశ్చిమ ఆఫ్రికాలోని బురుండి ఈశాన్య ప్రాంతంలో ఇప్పడివరకూ ముగ్గురు వ్యక్తులు ఈ వైరస్‌తో మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. రక్త నాళాల్లోకి వైరస్ ప్రవేశించడంతో అవి దెబ్బతిని ముక్కుద్వారా విపరీతంగా నెత్తురు వెలువడుతుంది. ఇది ఇంతకు ముందటి మరుబుర్గు, ఎబోలా లక్షణాలతో ఉండే వ్యాధిని పోలి ఉంది.

అయితే ఇప్పటి వైరస్ సంబంధిత వ్యాధికి ఇంతకు ముందటి ఈ రెండు రకాల వ్యాధులతో సంబంధం లేదని ఆరోగ్య మంత్రి తెలిపారు. తాజా వైరస్ సోకిన వారి రక్తపు నమూనాలను జాతీయ ప్రజా ఆరోగ్య నిపుణులు పరీక్షిస్తున్నారు. దీని తరువాత ఫలితాలను బట్టి ఇది ఏ వ్యాధి అనేది నిర్థారించుకుంటారు. ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువగా గిటోబే తెగలకు సోకుతోంది. ఇప్పటివరకూ ఈ విధమైన జబ్బులతో మృతి చెందిన వారు ఈ తెగకు చెందిన వారే. బజిరో ప్రాంతంలోని మిగ్వా పర్వతాల వద్ద నివసించే ఈ తెగల వారు ఈ వైరస్‌కు గురై ఇద్దరు చనిపోయినట్లు వెల్లడైంది.

ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు
విపరీతమైన కడుపు నొప్పి, ఇదే దశలో ముక్కులో నుంచి నెత్తురు రావడం జరుగుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే పరిస్థితి విషమించి వ్యక్తులు చనిపోతున్నారు. తలనొప్పి, అత్యధిక జర్వం, వాంతులు, మగత వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి. వైరస్ సోకిన వారు విపరీతమైన బాధకు గురవుతున్నారు. విలవిలలాడుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యి మృతి చెందుతున్నట్లు ఆసుపత్రి నర్సు ఒకరు తెలిపారు. ఇప్పటికైతే ఈ ప్రాంతంలోని రెండు పట్టణాలలో నివసించే వారిని ఇండ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండాలని అధికారికంగా ప్రకటనలు వెలువరించారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పలు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News