Thursday, January 23, 2025

పన్నెండేళ్ల మూగ, చెవిటి బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అసలే ఆమె మూగ, చెవిటి బాలిక. ఆపై పన్నెండేళ్లు కూడా దాటని మైనర్. అయినా ఆ దుర్మార్గులకు కనికరం కలగలేదు. ఆమెపై  అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలకుండా, ఆమె చేత ముష్టి ఎత్తిస్తున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ బాలికకు చెర వీడింది.

ముంబయిలోని చర్చి గేటు స్టేషన్ వద్ద పన్నెండేళ్ల బాలిక ముష్టెత్తుకుంటోంది. చెదరిన జుట్టు, చిరిగిన గౌను చూసి ఒక వ్యక్తికి అనుమానం వచ్చి, మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెళ్లి, ఆమెను పక్కకు తీసుకువచ్చి ఏం జరిగిందని అడిగితే ఏమీ చెప్పలేకపోయింది. ఎందుకంటే, ఆమె మూగది, చెవిటిది కూడా. ఇంతలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వచ్చి, ఆ బాలిక తమ కూతురనీ, తాము ఆమెను దత్తత తీసుకున్నామని పోలీసులకు చెప్పారు. పోలీసులు అనుమానంతో ముగ్గురినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.

ట్రాన్స్ జెండర్లలో ఒకామె పేరు భారతి అలియాస్ రాఖీ(32). అమెకు ఇద్దరు అనుచరులు ఉన్నారు. వీరు ముగ్గురూ చర్చిగేటు స్టేషన్ – వాంఖడే స్టేడియంకు మధ్య దంధా సాగిస్తూ ఉంటారు. వీరిని ఎంతగా ప్రశ్నించినా, అత్యాచారానికి పాల్పడింది ఎవరో చెప్పడం లేదనీ, త్వరలో వారి చేత నిజం కక్కించి, కేసు నమోదు చేస్తామని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. అత్యాచారానికి గురైన బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నామని, వారి అడ్రస్ దొరికితే బాలికను వారివద్దకు చేరుస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News