న్యూఢిల్లీ : ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను భారతీ ఎయిర్‌టెల్ ప్రారంభించింది. 5జి, ఐఒటి, క్లౌడ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్లకు పరిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రారంభ దశ భారతీయ స్టార్టప్‌లను ఆహ్వానిస్తోంది. టాప్ 10 స్టార్టప్‌లు నగదు బహుమతులను అందుకోవడంతో పాటు ఎయిర్‌టెల్ డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, గ్లోబల్ పార్ట్‌నర్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఎంపిక చేసిన స్టార్టప్‌లు ఎయిర్‌టెల్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతాయి.
జూనిపర్ నెట్‌వర్క్‌తో డీల్
దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించేందుకు ఎయిర్‌టెల్ తాజాగా కాలిఫోర్నియాకు చెందిన జూనిపర్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంఎక్స్ సిరీస్ రూటర్స్, లైన్ కార్డుల అప్‌గ్రేడ్‌కు జూనిపర్ నెట్‌వర్క్ ఇన్‌స్టాల్, సపోర్ట్ అందించనుంది.