Thursday, November 14, 2024

‘స్పామ్’ లెక్క తేలిస్తేనే ట్విట్టర్‌తో డీల్

- Advertisement -
- Advertisement -

బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటన

Deal with Twitter spam accounts

 

న్యూయార్క్ : టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంపై మరో ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలను కలిగి ఉన్నాయని కంపెనీ నిరూపించే వరకు తాను ట్విట్టర్‌తో ఒప్పందాన్ని కొనసాగించబోనని స్పష్టం చేశారు. ట్విట్టర్ సిఇఒ పరాగ్ అగర్వాల్ వాదనలకు విరుద్ధంగా ట్విట్టర్‌లో 20 శాతం వరకు స్పామ్ ఖాతాలు ఉన్నాయని మస్క్ ఇటీవల పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ట్విట్టర్ 5 శాతం స్పామ్ ఖాతాలను కలిగి ఉందని గత వారం ట్విట్టర్ నివేదించింది. టెస్లా సిఇఒ ట్విట్టర్ వాదనలను తిరస్కరిస్తూ, ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్కువ ధరకు ట్విటర్‌ను కొనుగోలు చేయాలనేది మస్క్ ప్లాన్ అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎలోన్ మస్క్ గత నెలలో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలును ప్రకటించిన తర్వాత కంపెనీ స్టాక్ విలువ పడిపోయింది.

అయితే తక్కువ ధరకు బేరసారాలు అర్థరహితం కాదని ఇటీవల మస్క్ అన్నారు. మస్క్ ట్విట్టర్ బిడ్‌ను వీలైనంత తక్కువగా పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ట్విట్టర్‌లో స్పామ్ ఖాతాలకు మస్క్ ఎప్పుడూ వ్యతిరేకం, డీల్ పూర్తయిన తర్వాత ప్లాట్‌ఫామ్ నుండి స్పామ్, నకిలీ ఖాతాలను తొలగించడానికే మొదటి ప్రాధాన్యతనిస్తారని భావిస్తున్నారు. అయితే ప్లాట్‌ఫామ్ నుండి నకిలీ, స్పామ్ ఖాతాలను తొలగించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తుందని సిఇఒ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ థ్రెడ్‌లో తెలిపారు. ట్విట్టర్ ప్రతిరోజూ అర మిలియన్ కంటే ఎక్కువ స్పామ్ ఖాతాలను సస్పెండ్ చేస్తుంది. వీలైనంత ఎక్కువ స్పామ్‌లను తొలగించడానికి సంస్థ సిస్టమ్‌లు, నియమాలను అప్‌డేట్ చేస్తామని అగర్వాల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News