Tuesday, September 17, 2024

‘డియర్ మేఘ’ మంచి లవ్ స్టోరీ..

- Advertisement -
- Advertisement -

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘డియర్ మేఘ’ను రూపొందించారు నిర్మాత అర్జున్ దాస్యన్. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘డియర్ మేఘ’ శుక్రవారం థియేటర్‌లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో మాట్లాడుతూ.. “ ‘డియర్ మేఘ’ మూవీ ఒక మంచి లవ్ స్టోరి. ఫిమేల్ కోణంలో సాగుతుంది. హైదరాబాద్, ముంబయ్, గోవాలో షూట్ చేశాం. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. హరి గౌర మ్యూజిక్‌కు చాలా పేరొచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి పేరొచ్చింది. నాలుగో పాట రిలీజ్ చేస్తున్నాం.- మేఘ అనే క్యారెక్టర్ కోణంలో సినిమా సాగుతుంది. అబ్బాయి లవ్ స్టోరీలు చాలా చూసి ఉంటాం. కానీ ఇది మేఘ అనే అమ్మాయి కోణంలో కొత్తగా ఉంటుంది. డబ్బు కంటే మాకు సినిమా అంటే ప్యాషన్ అందుకే ధైర్యంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా తర్వాత సుశాంత్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు” అని అన్నారు.

Dear Megha Movie release today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News