Tuesday, January 7, 2025

ఆత్మహత్యకు యత్నించిన ప్రియుడి మృతి

- Advertisement -
- Advertisement -

Death of boyfriend who tried to commit suicide

ప్రియురాలి పెళ్లిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
చిక్సిపొందుతూ మృతి

మనతెలంగాణ, హైదరాబాద్ : ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతోందని తెలుసుకుని ఫంక్షన్ హాల్‌లో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం….రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన షేక్ రఫిక్ కుమారుడు షేక్ అశ్వక్(19) అదే ప్రాంతానికి యువతిని ప్రేమించాడు. కాగా యువతి అశ్వక్‌ను వివాహం చేసుకోకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న అశ్వక్ గత నెల 30వ తేదీన లంగర్‌హౌస్‌లోని మొగల్‌గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లాడు. వెళ్లి యువతి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో యువతిని పట్టుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న బంధువులు వధువును కాపాడారు. వెంటనే అశ్వక్ మంటలను ఆర్పి వేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లంగర్‌హౌస్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News