Thursday, January 23, 2025

రష్యాలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

రష్యాలోని సెయింగ్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని నదిలో మునిగిపోయి మహారాష్ట్రకు చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. మరనించిన 18-20 సంవత్సల ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు సమీపంలోని వెలికీ నోవ్‌గొరోడ్ నగరంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మరో భారతీయ విద్యార్థినిని రక్షించే ప్రయత్నంలో ఈ నలుగురు విద్యార్థులు వోట్ఖోవ్ నదిలో మునిగిపోయారని స్థానిక మీడియా తెలిపింది. మతులను జల్గావ్ జిల్లాకు చెందిన హర్షల్ అనంత్‌రావు వేశలె, జిషన్ అష్పక్ పింజరి, జియా ఫిరోజ్ పింజరి, మాలిక్ గులాంగౌస్ మొహమ్మద్, మొహమ్మద్ యాకుబ్‌గా గుర్తించారు.

నిషా భూసేష్ సోనావానె నే విద్యార్థినిని రక్షించే ప్రయత్నంలో మిగిలిన నలుగురు నదిలో మునిగిపోయారు. నిషా మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు తరలించడానికి అక్కడి ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్లు జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు. కాగా..నదిలో మునిగిపోవడానికి ముందు జిషన్ అష్పక్ తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. నదిలో నుంచి బయటకు వచ్చెయ్యమని వారు కో౮రుతున్న సమయంలోనే పెద్ద అల వచ్చి వారంతా కొట్టుకుపోయారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News