హైదరాబాద్: సనత నగర్ లోని బాలుడి కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. సనత్ నగర్ బాలుడి మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని పేర్కొన్నారు. దోషులు ఎంతడి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని తలసాని మాట ఇచ్చారు.
బస్తీవాసుల భయాన్ని పోగేట్టేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని మంత్రి సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని అల్లాదున్ కోఠి ఏరియాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిని ఓ హిజ్రా కిరాతకంగా హత్యచేసిన విషయం తెలిసిందే.
బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం.
సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
అదే విధంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. pic.twitter.com/x580STisQW
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 21, 2023