Saturday, September 14, 2024

రేపిస్ట్‌లకు మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత చట్టాలను సవరిస్తాం
బెంగాల్ సిఎం మమతా బెనర్జీ

కోల్‌కతా : అత్యాచార ఘటనలను తన ప్రభుత్వం ఏమాత్రం సహించదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉద్ఘాటించారు. దోషులుగా తేలిన అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా ప్రస్తుత చట్టాలకు సవరణను వచ్చే వారం రాష్ట్ర శాసనసభలో ఆమోదించనున్నట్లు మమత తెలియజేశారు. సవరించిన బిల్లుకు ఆమోదముద్ర వేయడంలో గవర్నర్ ఆలస్యం చేసినా లేక ధ్రువీకరణ కోసం రాష్ట్రపతికి పంపినా తాను కోల్‌కతాలో రాజ్ భవన్ వెలుపల ధర్నా చేస్తానని మమత ప్రకటించారు.

దోషులుగా తేలిన అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించడానికి చట్టం ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో శనివారం నుంచి ఒక ఉద్యమాన్ని టిఎంసి ప్రారంభిస్తుందని సిఎం చెప్పారు. ‘వచ్చే వారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సవరణ బిల్లును ఆమోదిస్తాం. ఆ తరువాత దానిని గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపుతాం. ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినట్లయితే రాజ్ భవన్ వెలుపల ధర్నా చేస్తాం’ అని మమత కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దిన ర్యాలీలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News