Friday, November 15, 2024

సిఎం జగన్‌కు ప్రాణహాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్‌కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో వెల్లడించారు. సిఎం జగన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని స్పష్టం చేశారు. మరి కొన్ని వారాల్లో ఎపి ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సిఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఎపి ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఒక హెలికాప్టర్ ను విజయవాడలో, మరో హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు.

మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకోనున్నారు. ఇవి రెండు ఇంజిన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు. ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్లు లీజు రూపేణా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇతర ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం సిఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఎపి ఎవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రస్తుత హెలికాప్టర్ 2010 నుంచి వాడుకలో ఉన్నందున దాన్ని మార్చాల్సి ఉందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News