Friday, December 20, 2024

సోషల్ మీడియాలో ప్రధానికి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. మోడీని బాంబుతో హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌ను పుణెకు చెందిన రాహుల్ అనే వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు విచారణ ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు పోస్ట్‌లో ‘భారత్‌లో బాంబు పేలుళ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. బాంబుతో ప్రధానిని హత్య చేయాలనుకుంటున్నాను ’ అని రాశాడు. ఐని అడ్రస్ ప్రకారం ఆ పోస్ట్ చేసిన వ్యక్తి ఎంఎ హాకీమ్ గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసేందుకు అన్ని చోట్లా గాలిస్తున్నట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News