Monday, December 23, 2024

శరద్ పవార్‌కు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబయి: నూషనలిస్టు కాంగ్రెస్ పార్టీ( ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్‌నుహత్య చేస్తామంటూ ఓ బెదిరింపు మెస్సేజ్ వచ్చింది.సోషల్ మీడియా వేదికగా ఓ దుండగుడు శరద్ పవార్‌ను చంపేస్తామని ట్వీట్ చేసినట్లు ఎన్‌సిపి తెలిపింది. ఈ మేరకు పవార్ కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే నేతృత్వంలో ఎన్‌సిపి కార్యకర్తల ప్రతినిధి బృందం ముంబయి పోలీసు కమిషనర్ ఫన్సాల్కర్‌ను కలిసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పవార్‌కు ఫేస్‌బుక్‌లో ఓ దుండగుడి నుంచి త్వరలోనే నీకు కూడా నరేంద్ర దభోల్కర్ గతి తప్పదు అని బెదిరింపు సందేశం వచ్చిందని ముంబయి పోలీసులు చెప్పారు.

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన దభోల్కర్‌ను 2013 ఆగస్టు 20న పుణెలో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఆ విధంగానే పవార్‌ను కూడా చంపుతామని ఫేస్‌బుక్‌లో బెదిరింపు మెస్సేజ్ వచ్చింది. ఈ మేరకు ఆయన కుమార్తె సుప్రియా సూలె బెదింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రింట్‌అవుట్‌లను పోలీసులకు సమర్పించారు శరద్ పవార్‌ను బెదిరిస్తూ తన ఫోన్‌కు వాట్సాప్ మెస్సేజ్‌లు వచ్చినట్లు ఈ సందర్భంగా సుప్రియా సూలే చెపారు. కాగా తనకు వచ్చిన బెదిరింపు మెస్సేజ్‌పై పవార్ స్పందిస్తూ బెదిరింపులు జారీ చేయడం ద్వారా ఒక వ్యక్తి నోరు మూసేయించాలని ఎవరైనా అనుకుంటే అదివారి అపోహ మాత్రమేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News