- Advertisement -
బెంగళూరులోని బాబుసపల్య ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన తరువాత అన్వేషణ, సహాయ కార్యక్రమాల సమయంలో మరి ఆరు మృతదేహాలు వెలికితీసినట్లు, దీనితో మృతుల సంఖ్య ఏడుకు పెరిగినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. మంగళవారం కుంభవృష్టి సమయంలో దుర్ఘటన సంభవించినప్పటి నుంచి అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్).
రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ‘నిర్మాణంలోని భవనం యజమాని మునిరాజా రెడ్డి కుమారుడు భువన్ రెడ్డిని, భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ మునియప్పను నిర్బంధంలోకి తీసుకోవడమైంది’ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ‘నాలుగు అంతస్తుల భవనం నిర్మాణానికే అనుమతి ఉన్నది, కానీ ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
- Advertisement -