Friday, January 3, 2025

ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58 కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Death toll from Philippines landslides floods rises to 58

మనీలా : ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగి పడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58 కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదను తవ్వుతూ బృందాలు తప్పిపోయిన వారి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటి ఈ మెగి ప్రకృతి వైపరీత్యం కారణంగా సెంట్రల్ లేటె ప్రావిన్స్ లోని బేబే నగరం చుట్టుపక్కల గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంచుచరియలు విరిగి పడడం, నదులు పొంగడంతో ఆ గ్రామాల్లోని ఇళ్లకు ఇళ్లు కొట్టుకు పోయాయి. లక్ష మంది ఫిలిప్పీన్స్ వాసులపై ఈ తుపాను ప్రభావం పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News