Monday, December 23, 2024

మహారాష్ట్రలో 27కి చేరిన మృతుల సంఖ్య..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఆనందనగర్ తండాలో వరద నీటిలో చిక్కుకున్న 110 మందిని శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యావత్మాల్, బుల్ధానాలో వరద నీరు తగ్గింది. విదర్భ రీజియన్ అకోలాలో గత 24 గంటల్లో 100 మిమీ వర్షపాతం నమోదైంది.

రాయ్‌గఢ్ జిల్లాలో ఇర్షల్ వాడీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా 81 మంది జాడ తెలియడం లేదు. వారి కోసం నాలుగో రోజు కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News