Monday, December 23, 2024

నేపాల్ భూకంప ఘటనలో 128కి చేరిన మృతుల సంఖ్య..

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో భూకంప మృతుల సంఖ్య 128కి చేరుకుంది. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కర్నాలీ రాష్ట్రంలోని జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో వందల మంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనాస్థలాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నేపాల్ ప్రధాని ప్రచండ, భారత ప్రధాని నరేంద్ర మోడీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. నేపాల్ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని.. నేపాల్ కు అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్దంగా ఉందన మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News