Sunday, February 23, 2025

తమిళనాడులో వర్షబీభత్సం… 26కు పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Death toll rises to 26 after rains in Tamil Nadu

చెన్నై : ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తరువాత తమిళనాడులో కుండపోతలా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26 కి చేరింది. చెన్నైలో శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తిరువళ్లూరు జిల్లాలో మరొకరు మరణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు రూ. 4 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. గత 24 గంటల్లో తమిళనాడులో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News