Monday, December 23, 2024

47కి పెరిగిన తమిళనాడు కల్తీసారా మరణాలు

- Advertisement -
- Advertisement -

కల్లాకురిచిలో జరిగిన కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య 47కి పెరిగింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. గురువారం వరకు మఱణించిన 29 మంది వ్యక్తుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం జరిగిందని, వారికి దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని కల్లాకురిచి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ తెలిపారు. కల్తీ సారా తాగిన 165 మందిని కల్లాకురిచి, సేలంలోని జిక్మెర్, ముందియంబాక్కంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చారని, వీరిలో ఇప్పటివరకు 47 మంది మరణించారని ఆయన తెలిపారు. చికిత్స పొందుతున్న 118 మందిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు కోలుకున్నారని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News