ఇంఫాల్: మణిపూర్‌లోని నోనీ జిల్లా తుపుల్ వద్ద గత వారం ఒక రైల్వే ప్రాజెక్టు స్థలం వద్ద కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి పెరిగింది. రైల్వే ప్రాజెక్టుకు చెందిన నిర్మాణాల శిథిలాల కింద జమరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ప్రాదేశిక సైన్యానికి చెందిన ఒక సిబ్బందితోపాటు ఒక పౌరుడి మృతదేహం గురువారం లభించినట్లు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇప్పటికీ 12 మంది ఆచూకీ తెలియరానట్లు ఆయన చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారిందని అ అధికారి చెప్పారు. జూన్ 30న తుపుల్ వద్ద కొండ చరియలు విరిగిపడని దుర్ఘటనలో 29 మంది సైనిక సిబ్బంది, 20 మంది పౌరులు మరణించగా 18 మంది ఇతరులు గాయపడ్డారు. సహాయక చర్యల కోసం 880 మందికి పైగా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, అస్సాం రైఫిల్స్, స్థానిక వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది.
మణిపూర్ దుర్ఘటనలో 49కి చేరిన మృతుల సంఖ్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -