Thursday, January 9, 2025

కల్తీ మద్యం కాటుతో మృతులు 54

- Advertisement -
- Advertisement -

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో ప్రాణాంతక కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 54కు చేరింది. నాలుగయిదురోజులుగా కల్తీసారా బాధితులు చికిత్స పొందుతూ ఆసుపత్రులలో మరణిస్తూనే ఉన్నారు. స్థానికంగా ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్రమ సారా బట్టీల ధ్వంసం వంటి చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారని ,

కేసును సమగ్రరీతిలో దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా సీనియర్ అధికారి ఎంఎస్ ప్రశాంత్ మీడియాకు తెలిపారు. మద్యం వ్యాపారులు, విక్రేతలు, తయారీదార్లు, నాటు పదార్థాల తయారీ సరఫరా దార్లను పట్టుకుంటున్నట్లు వివరించారు. మృతుల సంఖ్య 54 అయిందని, వంద మంది వరకూ పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు, వీరిలో కొందరి పరిస్థితి విషమమే అని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News