Sunday, January 19, 2025

ఒడిశా పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు పెరుగుదల

- Advertisement -
- Advertisement -

ఒడిశా ఝార్సుగుడాలో పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని, శనివారం మరి ఐదు మృతదేహాలను వెలికితీశారని అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం పడవ మునిగిపోయిన వెంటనే గాలింపు ప్రారంభించిన ఒడిశా విపత్తు శీఘ్ర కార్యాచరణ దళం, అగ్నిమాపక శాఖ సిబ్బంది మహానది లో నుంచి మరి ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన తెలిపారు.

ఇంతకు ముందు రెండు మృతదేహాలు వెలికితీశారు. ఏడుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. నది హిరాకుడ్ రిజర్వాయర్‌లో నుంచి మరి ఐదు మృతదేహాలు వెలికితీశారని అధికారి తెలియజేశారు. మృతదేహాలను శవపరీక్ష కోసం తరలించినట్లు ఆయన తెలిపారు. ఆ ఐదింటిలో రెండు మహిళలవని, మూడు బాలురివని ఆయన తెలిపారు. మృతులు అందరూ పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సేని ప్రాంతం వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News