- Advertisement -
కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలి టీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రామంలో విచక్షణారహితంగా వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సిఐ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని పెద్ద దగడ గ్రామానికి చెందిన తిరుపతయ్య(33) అనే వ్యక్తికి చుక్కాయిపల్లికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
గతంలో తిరుపతయ్యకు మహిళ భర్తకు గొడవలు అయ్యాయి. ఎన్ని సార్లు చెప్పిన వినకుండా రాత్రి ఎవరు లేని సమయంలో తిరుపతయ్య ఇంటికి రావడాన్ని గమనించిన మహిళ భర్త నిరంజన్ అతనిని ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం నిందితుడు నిరంజన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు
- Advertisement -