Wednesday, October 16, 2024

కలుషిత నీటి సరఫరా వల్ల జరిగిన మరణాలు

- Advertisement -
- Advertisement -

ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కలుషిత తాగునీరు తాగి సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మరణించిన ఘటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ది చేసి రాష్ట్రమంతటా తాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ సర్కార్ సరిగ్గా నిర్వహించలేకపోతుందని మండిపడ్డారు.

సంజీవన్‌రావుపేటలో కలుషిత నీటి సరఫరా వల్ల జరిగిన మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్నవారికి తగిన సాయం అందించాలని, తెలంగాణలో మరెక్కడ ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News