Sunday, December 22, 2024

కరోనా కలవరం

- Advertisement -
- Advertisement -

ఒకే రోజు 12 మరణాలు

కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా కారణంగా 12 మరణాలు చోటుచేసుకోవడం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 761 కొవిడ్ 19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్ సబ్ వేరియంట్ జెఎన్1 కేసులు కూడా పెరిగిపోతున్నాయి. గురువారం నాటికి దేశంలో 619 జెఎన్ 1 కేసులు నమోదయ్యాయి. కాగా..కొవిడ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం తెలిపింది. బుధవారం 4,423 ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య గురువారానికి 4,334కి తగ్గింది. కేరళళలో అత్యధికంగా 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్నాకటలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున నమోదయ్యాయి. కరోనా కారణంగా 12 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది.

కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తర్ ప్రదేశ్‌లో ఒకరు మరణించినట్లు కేంద్రం తెలిపింది. జెఎన్ 1 వేరియంట్‌కు సంబంధించి గురువారం నాటికి 12 రాష్ట్రాలలో మొత్తం 619 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలోని అత్యధికంగా 119 కేసులు నమోదయ్యాయి. కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హర్యానాలో ఒకటి చొప్పున జెఎన్ 1 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 5వ తేదీ వరకు రెండంకెల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు జెఎన్ 1 వేరియంట్ వెలుగుచూడడం, చలిగాలుల తీవ్రత పెరడగం వంటి పరిణామాల తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది. 2020 ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్నకాలంలో కరోనా కేసులు లక్షల్లో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా నాలుగేళ్ల కాలంలో 5.3 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అయితే 4.4 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా జాతీయ రికవరీ రేటు 98.81 శాతమని ఆరోగ్య శాఖ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా..దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ అందచేసినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News