Monday, December 23, 2024

డిబార్‌ అయిన హరీష్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 03వ తేదీన మొదలైన మొదటి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్ అవడం విద్యాశాఖలో కలకలం రేపింది. మరుసటి రోజు హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైన విషయం మీకు తెలిసిందే. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వరంగల్‌లో హిందీ పేపర్‌ లీకేజ్‌ అయిన వ్యవహారంలో.. హరీష్‌ అనే పదో తరగతి విద్యార్థిపై ఐదేళ్ల డిబార్ విధించారు. అయితే తానేమి తప్పు చేయలేదని ఎవరో వ్యక్తి పరీక్ష హాల్‌ కిటీకి దగ్గరకు వచ్చి తనను ప్రశ్నపత్రం ఇవ్వమని అడిగాడని, ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతోనే ఇచ్చానని హరీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. హరీష్‌ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ డిబార్‌ ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని తమ గోడు వెల్లబోసుకున్నారు.

అయితే దీనిపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా శనివారం హైకోర్టు ఈ అంశంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. హరీష్‌కు ఊరటినిచ్చేలా తీర్పునిచ్చింది. హరీష్‌కు మిగతా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు తెలిపింది. హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలకు హాజరుకావొచ్చని హైకోర్టు తెలిపింది. హరీష్‌కు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు అధికారులకు తెలిపింది. ఐదేళ్లు డిబార్‌ చేయడం వల్ల తన కొడుకి భవిష్యత్తుకు తీరని అన్యాయం జరుగుతుందని హరీష్‌ తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలు రాసే అవకాశం లభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News