Thursday, January 23, 2025

ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్‌లో చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ తేదీన ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. లోక్‌సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోడీ పార్లమెంట్‌కు రావాలని గత కొద్ది రోజులుగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ కీలక అంశంపై ప్రధానే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి.

Also Read: రష్యా గ్రంథాలయాల్లో అన్నాభావ్ విగ్రహాలు: కెసిఆర్

లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులు ఉన్నారు. ఈ తీర్మానంపై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ మణిపూర్‌పై ప్రధాని స్పందించాలనే లక్షం తోనే దీనిని ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఇదివరకు విపక్షాలు చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమకు మూడింట రెండొంతులు మెజారిటీ ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశ పెట్టడానికి ముందే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలనే నిబంధనేమీ లేదని , 10 రోజుల్లోగా ఎప్పుడైనా చేపట్టవచ్చని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News