Wednesday, January 22, 2025

దశాబ్ది ఉత్సవాలు అభివృద్ధికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

గద్వాల: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ అబివృద్ధ్దికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం రాజీవ్ చౌరస్తా నుండి కృష్ణవేణి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో 21 రోజుల పాటు వివిధ రకాల పండుగలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ నెల 22 వరకు జరిగే ఉత్సవాలు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఆర్డీఓ రాములు, ఈడి రమేష్ బాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News