Tuesday, November 5, 2024

అమరవీరుల సంస్మరణలతో ముగిసిన దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల గ్రామాల్లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో ముగిశాయి. సదాశివనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గైని అనసూయ రమేష్, తహశీల్దార్ కే.ధన్వాల్, ఎంపిడివో కొండ లక్ష్మీమండల పరిషత్ పాలక వర్గం తెలంగాణ అమర వీరుల త్యాగాలను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపిపి తన కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో అమర వీరుల సంస్మరణ సంతాప సభ ను ఉద్దేశించి మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా ప్రతి రోజు ప్రభుత్వం చేపట్టి అభివృద్ధ్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించామన్నారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, ఎంపిటిసీ లు పాపనోల్ల బీరయ్య, రాంచెందర్ రావు, భైరవరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు యండి.అల్తాఫ్, సీనియర్ అసిస్టెంట్ శేశాచారి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పరమేష్‌గుప్తా, మధుపట్ల రమేష్ రావు, సంకరి రాజలింగం, ఎంపివో సురెందర్ రెడ్డి, ఐపియం రాజిరెడ్డి, పాల్గొన్నారు. లింగంపల్లి, పద్మాజివాడి, భూంపల్లి, తుక్కోజివా డి, తిమ్మోజివాడి,జనగాం, ఉత్తునూర్, యాచారం తదితర గ్రామాలలోని జీపి కార్యాలయాల్లో పంచాయతీ పాలకవర్గాలతో కలసి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అమరవీరుల సంస్మరణ సంతాప సభలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News