Monday, January 20, 2025

దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుంది

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్ర భుత్వ విప్ గంపగోవర్ధ్దన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శనివారం సుపరిపాలన సంబురాలకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గతంలో రెండు లైన్ల రోడ్లు ఉండగా వాటికి నాలుగు లైన్ల రోడ్లుగా మార్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మారుమూల ప్రామాల ప్రజలు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవారని చెప్పారు. కామారెడ్డి జిల్లా ఏర్పడటం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

రైతు దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ, సంక్షేమ సంభురాలకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేశారని చెప్పారు. సబ్బండ వార్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకమందని ఇళ్లు లేదని లబ్ధ్దిదారుడు లేని కుటుంబం లేదని పేర్కొన్నారు. జిల్లా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి రాష్ట్రంలో అన్ని రంగాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచే విదంగా చూడాలన్నారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి అన్ని కులాలకు, మతాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ శోభ మాట్లాడారు.

కొత్త జిల్లా ఏర్పాటు అయిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధ్ది జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలనే లక్షంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో కార్పోరేట్ పాఠశాలల తరహాలో బీబీపేట్ ప్రభుత్వన్నత పాఠశాల సముదాయం, భవానీపేట్ గ్రామ పంచాయతీ భవనం నిర్మించారని తెలిపారు. పల్లె పగతి, పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News