Tuesday, December 24, 2024

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి

సిద్దిపేట: దశాబ్ది ఉత్సవాల ను ఘనంగా నిర్వహించాలని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపిడిఓ కా ర్యాలయంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా క్లస్టర్లకు సంబంధించిన ఇంచార్జిలు, జన సమీకరణపై సమావేశాలు నిర్వహించి ఆలంకరణ ఏర్పాట్లు భోజనాలు తదితర కార్యక్రమాలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు అధికారులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించి ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలన్నారు.

ఏర్పాట్లను అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎంపిపి సవితా ప్రవీణ్‌రెడ్డి, రూరల్ ఎంపిపి శ్రీదేవి చందర్‌రావు, వైస్ ఎంపిపి ఎల్లం , రూరల్ జడ్పిటిసి శ్రీహరిగౌడ్, ఎంపిఓ శ్రీనివాసరావు, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల్ రంగం, రైతు సమన్యయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, రూరల్ వైస్ ఎంపిపి యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపిటిసిలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News