Monday, December 23, 2024

దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతవరణంలో అంగరం గ వైభవంగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే ప ద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 21 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను మహాయజ్ఞంలా భావించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి భాగస్వామ్య ంతో విజయవంతం చేయాలన్నారు. 2014 పూ ర్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొమ్మిదేండ్లలో రా ష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన గణనీయ ప్రగతి ప్ర తిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

బుధవారం స్థానిక క్రిస్టల్ గార్డెన్‌లో మెదక్ నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలు సమర్థవంతంగా నిర్వహించుటకు గాను విధి విధానాలు ఖరారు చేయుటకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నియోజకవర్గ ఇంచార్జి ప్రత్యేకాధికారి అదనపు కలెక్టర్ రమేష్, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మనకు ఇచ్చిన బాధ్యత ను సమర్థవంతంగా పాటిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ప డ్డ కష్టాలు, రాష్ట్రం వచ్చాక దశాబ్ద కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలన్నారు.

జూన్ 2 నుంచి 22 వరకు రోజు ఒక కార్యక్రమం చొప్పున చేపట్టి అభివృద్ధ్ది, సంక్షేమంలో నాడు -నేడు సాదించిన ప్రగతిపై ప్రజలకు అవగాహణ కలిగిస్తూ ప్లెక్సీల ద్వారా తాజా పరిస్థితులపై అద్దంపట్టేలా ఏ ర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో రైతు దినోత్స వం, ఊరూరా చెరువుల పండగ చాలా పెద్ద కార్యక్రమాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా సమన్వయంతో పనిచేస్తేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని అన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులను ఇంచార్జిలుగా నియమిస్తున్నామని, గ్రామస్థాయి, నియోజకవర్గస్థాయిలో ఒక్కో ప్రాంతలో వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

తొమ్మిది సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రం సాదించిన ప్రగతిని, సంక్షేమం, అభివృద్ధ్ది రెండు కార్యక్రమాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంతో ఇంటి పండుగలా పనిచేయాలని, జూన్ 22 వరకు ఎవరు విశ్రమించరాదని కోరారు. రైతు దినోత్సవం రోజు నియోజకవర్గంలోని 25 రైతు వేదికలను శోభయమానంగా అలంకరించాలని, వేయి మందితో సభ ఏర్పాటు చేయాలని, పంటకాలం ఒక నెలముందు జరుపుటకు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ శాఖ నుంచి చె రువుల వద్ద మహిళలతో బతుకమ్మ బోనాలు కట్టమైసమ్మ కార్యక్రమాలు వనభోజనం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలపై మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులతో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాల నిర్వహణ తీరు, బాధ్యతలపై అవగాహన కలిగించామన్నారు. రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండగ పెద్ద కార్యక్రమాలని చక్కటి కార్యాచరణ, ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు.

వేయి మందితో నిర్వహించే రైతు దినోత్సవానికి రైతు వేదిక సరిపోకపోతే పక్కనే ఏర్పాటు చేసుకోవాలని మూడు రోజులు వేదికలను మామిడితోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ఊరూరా చెరువుల పండగ రోజు ప్రతి గ్రామపంచాయతీలోని ఒక పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని గోరెటి వెంకన్న పాటలు ప్లే చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఎక్కడ, ఎలా నిర్వహించే తీరుపై ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా అధికారులు, డిఎస్పి సైదులు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయాధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News