- ప్రతి కార్యాలయం విద్యుత్ దీపాలతో కళకళ లాడాలి
- నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష
పటాన్ చెరు: జూన్ 02 నుంచి 22 వరకు నిర్వహించనున్న పదేళ్ల ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పటాన్‌చెరు జిఎంఆర్ కన్వేన్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ప్రతి బిఆర్‌ఎస్‌కి చెందిన ప్రతి నాయకుడు కార్యకర్త పాల్గొనాలన్నారు. పదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధ్దిని ప్రతిఒక్కరికీ తెలియజేయాలన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ లాంటి నాయకున్ని చూడలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కాళ్లి అరిగేలా తిరిగిన లక్ష రూపాయల నిధులు వచ్చేవి కావని కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఒకప్పుడు కాలుష్యానికి చిరునామగా ఉన్న పటాన్‌చెరు నేడు గెటేడ్ కమ్యూనిటీలకు అడ్డాగా మారిందన్నారు. గ్రామాల మధ్య అనుసంధాన మార్గాల కోసం 24 బ్రిడ్జీలను నిర్మానించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 24 గం.ల విద్యుత్‌తో నియోజకవర్గంలోని పరిశ్రమలు మంచి ఉత్పత్తులు సాధిస్తున్నాయన్నారు.
స్థానిక కార్మికుల సంక్షేమం కోసం రూ.300 కోట్ల అంచన వ్యయంతో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి ముఖ్య మంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్టుగా తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల్లో విద్య అందిస్తున్నట్టుగా చెప్పారు. పటాన్‌చెరులో సొంత భవనాల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నట్టుగా చెప్పారు. 20 రోజుల పాటు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.