Thursday, October 24, 2024

డిడిఎస్ భూ మాయ!

- Advertisement -
- Advertisement -

డిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేసిన మహిళా పొదుపు సంఘాలు రెండు రకాల వినియోగాల కోసం చిన్న చిన్న కమతాలను (4 నుంచి 7 ఎకరాలను) కొనుగోలు చే సా యి. వ్యవసాయ కార్మికులుగా పనిచేసే కూలీల ను మహిళా రైతులుగా మార్చడం, పాఠశాలలు లేని ఊళ్లలో బాల్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో పొదుపు సంఘాలు, డిడిఎస్ సంయుక్తంగా భూములు కొనుగోలు చేశాయి. ఆ రోజుల లో జహీరాబాద్, సం గారెడ్డి చుట్టుపక్కల ఎకరా భూమి రెండు నుంచి రెండున్నర వేల రూపాయ ల ధర మాత్రమే పలికేది. వీటి కొనుగోలు వ్య యంలో పావు వంతు మహిళా సంఘాలు, ము ప్పావు వంతు డిడిఎస్ భరించేది. సంఘ సభ్యు ల నుంచి సేకరించిన మొత్తానికి అదే సంఘానికి రి వాల్వింగ్ ఫండ్ రూపేణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, దాతల నుంచి వచ్చిన వి రాళాలను కలిపి డిడిఎస్ స మకూర్చేది. అలా కొనుగో లు చేసిన భూమిలో మహి ళా సంఘాలకు వాటా ఉంది.

కానీ వాటాదారులను నామమాత్రమైన సం ప్రదించకుండా, కనీస సమాచా రం ఇవ్వకుండానే కొంతకాలంగా డి డిఎస్ ఏకపక్షంగా భూములు అమ్ముకోవడం వి వాదాస్పదంగా మారింది. డిడిఎస్ తీరుపట్ల సం ఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కు న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టారు.మహిళా సంఘాలను సంప్రదించకుండా 83 ఎకరాలు ఇతరులకు విక్రయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో కుప్పానగర్ (5 ఎకరాలు), మాచ్‌నూర్ (5 ఎకరాలు), కృష్ణపూర్ (3) ఎకరాలు, పస్తాపూర్ (5 ఎకరాలు), ఖాసీంపూర్ (7 ఎకరాలు), సంగాపూర్ (5 ఎకరాలు), బొప్పనపల్లి (5 ఎకరా లు), రాయిపల్లి (5 ఎకరాలు), ఎలిగోయి (5 ఎకరా లు), మెట్లకుంట (5 ఎకరాలు), చీల్‌మామిడి (5 ఎకరాలు), ఆల్‌గోలే (5 ఎకరాలు), ఇదులపల్లి (5 ఎకరాలు) మొత్తం కలిపి 65 ఎకరాలు ఇప్పటికే విక్రయించగా, మరో 8 గ్రామాల్లో బాల్వాడీ కేంద్రాలకు చెం దిన 18ఎకరాలు విక్రయించడానికి ఇప్పటికే ఒప్పం దం జరిగినట్టు సంబంధిత మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవే కాకుండా జహీరాబాద్, సంగారెడ్డి మండలాల మహిళా సంఘాలకు చెందిన భూములు నిమ్జ్ చేపట్టిన భుసేకరణలో కొల్పోగా వాటికి సంబంధించి వచ్చిన నష్టపరిహారాన్ని డిడిఎస్ యే తన ఖాతాలో వేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు.

ఇలా ఉండగా.. ఆ కాలంలో (35 ఏండ్ల కిందట) ఎకరా భూమి రెండున్నర వేలు మాత్రమే ఉండటంతో రూ.10 వేలకు తమ సంఘం 4 ఎకరాలు కొనుగోలు చేసిందని రాయికోడ్ మండలం శంషాద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన పులకంటి రాజు వివరించారు.ఇది కొనుగోలు చేయడానికి తమ వాటాగా రెండున్నర వేలు పెడితే, డిడిఎస్ ఏడున్నర వేలు చెల్లించిందన్నారు. డిడిఎస్ చెల్లించిన డబ్బు తమ సంఘం సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చిన రివాల్వింగ్ ఫండ్‌నే భూమి కొనుగోలుకు పెట్టినట్టు తమకు అప్పట్లో సంస్థ చెప్పిందని వివరించారు. గత ఏడాది డైరెక్టర్ సతీష్ చనిపోయిన తర్వాత ఒక రోజు తమ సంఘానికి చెందిన భూమిలో ఉన్న వేపమిల్లు (సేంద్రియ ఎరువు తయారీ యంత్రం) యంత్రాన్ని, రేకుల షెడ్డు రాత్రికి రాత్రి ఎవరో గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారని వివరించారు. ఆ పని చేసింది ఎవరని తాము ఆరా తీయగా డిడిఎస్‌కు చెందిన వినయ్‌కుమార్ డిసిఎం వ్యాన్‌లో తీసుకెళ్లినట్టు బయటపడిందని పులకంటి రాజు వివరించారు.

మహిళా సభ్యులు వెళ్లి అతన్ని నిలదీయగా, శంషాద్దీన్‌పూర్ సంఘానికి చెందిన 4 ఎకరాలను డైరెక్టర్ సతీష్ బతికి ఉన్న రోజుల్లోనే తనకు అమ్మినట్టు వినయ్‌కుమార్ చెబుతున్నాడని సంఘం నాయకురాలు లలితమ్మ వాపోయారు. తమ వాటా డబ్బులతో కొనుగోలు చేసిన భూమిని తమను సంప్రదించకుండా డిడిఎస్ ఎలా అమ్ముకుంటుందని లలితమ్మ ప్రశ్నించారు. బ్యాంక్‌లో కొన్ని పేపర్లు ఇవ్వాల్సి ఉందని తెల్లకాగితాలపై తమ వేలి ముద్రలను తీసుకున్న డిడిఎస్, వాటిని ఉపయోగించే తమకు తెలియకుండా మోసపూరితంగా తమ నాలుగు ఎకరాలను ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకుందని శంషాద్దీన్‌పూర్ సంఘానికి చెందిన దళిత మహిళలు లబోదిబోమంటున్నారు.

నష్టపరిహారం డిడిఎస్ ఎలా తీసుకుంటుంది?
న్యాలకల్ మండలం బసంతపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘానికి 6 ఎకరాల 8 గుంటల స్థలం ఉంది.ఇది సంఘం సభ్యురాలు దివంగత ముల్లమ్మ, డిడిఎస్ కలిసి కొనగోలు చేసినట్టు ధరణి రికార్డులలో కూడా ఉంది. ఈ భూమి జహీరాబాద్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన నిమ్జ్ (నేషనల్ ఇండస్ట్రీయల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ జోన్) జరిపిన భూ సేకరణలో పోయింది. నష్ట పరిహారంగా ఎకరానికి రూ. 15 లక్షల చొప్పున చెల్లించాలన్న కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, తీర్పు వచ్చే వరకు పాక్షికంగా కొంత మొత్తాన్ని చెల్లించనున్నట్టు నోటీసు వస్తే చెక్కు తీసుకోవడానికి వెళ్తే, అది తమ భూమి నష్టపరిహారం తమకే వస్తుందని డిడిఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చెక్క్ ఇవ్వలేదని ముల్లమ్మ కూతురు సులోచన వాపోయింది. ధరణి రికార్డుల్లో కూడా సంఘం తరఫున తన తల్లి పేరుపై ఉన్నప్పటికీ నష్ట పరిహారం తమకు ఇవ్వకుండా ఆపే అధికారం డిడిఎస్‌కు ఎక్కడిదని సులోచన ప్రశ్నించింది.

ముల్లమ్మ చనిపోక ముందే డిడిఎస్ ప్రతినిధులు ఒక రోజు వచ్చి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకెళ్లారని, నిరక్షరాస్యులు కావడంతో వారు చెప్పిన చోటల్లా వేలి ముద్రలు వేసిందని డిడిఎస్ లో కొంతకాలం పని చేసిన ఇదే సంఘానికి చెందిన మ్యాతరి శ్యామల వివరించారు. అప్పుడు తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని ఆ తర్వాత తమ సంఘానికి చెందిన భూమిలో తనకు కూడా వాటా ఉన్నట్టు డిడిఎస్ పత్రాలను సృష్టించుకుందని శ్యామల ఆరోపించారు. ఒకవేళ మహిళా సంఘాలు పని చేయకపోయినా, డిడిఎస్ కార్యాకలాపాలు ఆపేసినా సంఘం పేరున ఉన్న భూమి సంఘానికే చెందుతుందని చెప్పి ఇప్పుడు ఆ భూమి తనదే అని అంటుందని, ఇది పచ్చి మోసం కాదా? అని శ్యామల ప్రశ్నించింది.ఇదే మండలానికి చెందిన కలిమెల మహిళా సంఘానికి చెందిన భూమిని నిమ్జ్ సేకరించగా చెల్లించిన రూ.2 కోట్ల నష్ట పరిహారం చెక్కును డిడిఎస్ తన ఖాతా వేసుకుందని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు భూమి కొనుగోలులో తమ డబ్బు కూడా ఉండడంతో నష్టపరిహారాన్ని డిడిఎస్ ఒక్కటే ఎలా తీసుకుంటుందని సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు.తమ వాటాకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పించమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సభ్యులు వాపోతున్నారు.

న్యాయం కోసం సంఘాల ఆందోళన
నలబై ఏండ్ల పాటు తమ కష్టార్జితంతో కూడబెట్టుకున్న డబ్బులను, భూములను, దాతలు ఇచ్చిన విరాళాలను మోసపూరితంగా తన ఖాతాలో వేసుకున్న డిడిఎస్‌పై చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని దాదాపు అన్ని సంఘాలు ఆందోళన బాట పట్టాయి. గత ఏడాది మార్చిలో డైరెక్టర్ సతీష్ మరణం తర్వాత డిడిఎస్ మోసాలు, అక్రమాలు బయటపడటంతో మహిళా సంఘాల సభ్యులు న్యాయం కోసం బజారున పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనరసింహ దళితుడు కావడంతో డిడిఎస్ వంచించిన దళిత మహిళలకు న్యాయం చేస్తారన్న ఆశతో వెళ్లి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని రాయికోడ్ మండలం శంషాద్దీన్‌పూర్ మహిళా సంఘం సభ్యురాలు లలితమ్మ వాపోయింది. డిడిఎస్ చేసిన మోసాలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహను కలిస్తే కలెక్టర్‌ను కలువమని చెప్పారని డిడిఎస్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు జయప్ప, జగన్నాథ్‌రెడ్డి వివరించారు.

మంత్రి చెప్పారని కలెక్టర్‌ను కలిస్తే ఆర్డీవోను కలువమనని చెప్పారని, ఆర్డీవోను కలిస్తే ఎమ్మార్వోను కలువమన్నారని, ఆయనేమో డిడిఎస్‌లో పెద్ద తలకాయలు ఉన్నాయని తామేమి చేయలేమని చేతులు ఎత్తేసారని వారు వాపోయారు. డిడిఎస్‌లో సభ్యుల వాటా ధనం, విదేశీ విరాళాలు, ప్రభుత్వ గ్రాంట్లు ఉండడంతో దీనిపై విచారణను ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే విచారణకు ఆదేశించి న్యాయం చేయాలని డిడిఎస్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ డైరెక్టర్‌గా ఉన్న కేఎస్ గోపాల్ అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలను మోసం చేయడం, విదేశీ, ప్రభుత్వ సంస్థల నిధుల దుర్వినియోగం పై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని హైకోర్టులో కేసు వేసినట్టు గోపాల్ తెలిపారు. మరోవైపు డిడిఎస్ దారుణంగా మోసం చేసిన దళిత మహిళా సంఘాల ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన నిజనిర్దారణ సంఘం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. మహిళా సంఘాలకు చెందాల్సిన డబ్బు, వారి పేరు మీద ఉన్న భూములను వారికే అప్పగించాలని డిడిఎస్ ప్రస్తుత డై రెక్టర్ రుక్మిణిరావును కలిసి కోరింది. మహిళా సంఘాలకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో వెళ్లి సంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మామిడ్గి, బసంతపూర్, శంషాద్దీన్‌పూర్ గ్రామాలకు ఈ ప్రతినిధి వెళ్లినప్పుడు మహిళా సంఘాల సభ్యులు వాపోయారు.

విరాళాలు నిలిపివేత
డిడిఎస్‌కు జర్మనీ, కెనడా, యుకెలకు చెందిన సంస్థలు, పెద్ద పెద్ద ఎన్జీవోలతో పాటు యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తునా ఫండింగ్ వచ్చేది. డిడిఎస్ కార్యాకలాపాలు మునుపటిలా చురుకుగా లేకపోవడం,నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో విరాళాలను నిలిపివేశారు. విదేశీ సంస్థలకు డిడిఎస్ పై ఇండియాలో కేసులు పెట్టే అధికారం లేకపోవడంతో ఫండింగ్‌ను నిలుపదల చేయడంతో సరిపెట్టుకుంది. ప్రతి ఏటా కోటి రూపాయల విరాళం ఇచ్చే స్వీడన్ ప్రభుత్వం దానిని ఆపేయడమే కాకుండా డిడిఎస్ కార్యకలాపాలను పరిశీలించకుండానే ఇంతకాలం నిధులు ఇవ్వడానికి బాధ్యుడైన అధికారిని తొలగించి చర్య తీసుకున్నట్టు తెలిసింది.

డిడిఎస్ డైరెక్టర్ సతీష్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరితే ఆయన చికిత్స కోసం సంస్థకు చెందిన రూ.2 కోట్లు ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది. డిడిఎస్‌కు విదేశీ సంస్థలు, ప్రభుత్వం ఇచ్చిన నిధులను వ్యక్తిగత అవసరాలకు ఏ విధంగా ఖర్చు చేసిందో చెప్పాలని సంస్థ వ్యవస్థాపక సభ్యుడు కేఎస్ గోపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, రివాల్వింగ్ ఫండ్‌ను కూడా నిలిపేసిన విషయం 2022-23 డిడిఎస్ వార్షిక నివేదికలో పరోక్షంగా బయటపడింది. మహిళా సాధికారిత పేరిట నాలుగు దశాబ్దాల పాటు సంస్థను నడిపి పెద్ద ఎత్తున స్థిర చరాస్తులను కూడబెట్టుకొని సంఘ సభ్యులకు చెందిన నిధులు, వారికే చెందాల్సిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని మహిళా పొదుపు సంఘాలు ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News