Sunday, December 22, 2024

మహిళల డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/జహీరాబాద్ : దక్కన్ డవలప్‌మెంట్ సొసైటీ (డిడిఎస్) తన మహిళా పొదుపు సంఘాలను ఏ విధంగా మోసం చేసిందీ ‘మన తెలంగాణ’ రెండు రోజులుగా వరస కథనాలతో బయట పెట్టడం తో ఆ సంస్థ చైర్మన్ బిపి సంజయ్ స్పందించారు. గురువారం మణిపాల్ నుంచి హుటాహుటిన జహీరాబాద్‌కు వచ్చిన బిపి సంజయ్ తన ఉద్యోగులు, తనకు అనుకూలంగా ఉండే కొన్ని మహిళా సంఘాలతో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. కాగా డి డిఎస్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలపై ‘మన తెలంగాణ’ బయట పెట్టిన అంశాలను చైర్మన్ పరోక్షంగా అంగీకరిస్తూ, కొన్ని మహి ళా సంఘాలకు చెందిన సభ్యులు తమ వద్ద పొదుపు చేసిన

డబ్బులను తిరిగి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే కొన్ని మహిళా సంఘాలు డిడిఎస్ నుంచి తీసుకున్న అప్పులు బకాయిపడ్డాయని ఆయన పేర్కొన్నారు. నిమ్జ్ భూసేకరణలో మహిళా సంఘాలకు చెందిన కొల్పొయిన భూములకు సంబంధించిన నిధులు డిడిఎస్ వద్ద ఉన్నది వాస్తవమైనని చైర్మన్ అంగీకరిస్తూ, మరో రెండు గ్రామాలకు చెందిన నష్టపరిహారం రావాల్సి ఉందని తెలిపారు. సంస్థ డైరెక్టర్ సతీష్ మరణించిన తర్వాత తాము ఎలాంటి భూములను అమ్మలేదని, అంతకుముందు 2020లో కొన్ని భూములు అమ్మిన విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. పది గ్రామాలలో బాల్వాడీ సంఘాలకు 43 ఎకరాలు ఉన్నాయని, వాటిని తాము అమ్మలేదని పేర్కొన్నారు.

డిడిఎస్‌కు దూరమైన సంఘాలకు చెందిన 825 మంది సభ్యులు సంస్థకు ఎలాంటి అప్పు లేకపోవడంతో వారికి సంబంధించిన రూ.5,24,000 తిరిగి ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే 48 గ్రామాలకు చెందిన సభ్యులు డిడిఎస్‌కు రూ.24,19,375 బకాయిపడ్డారని చైర్మన్ తెలిపారు. వివిధ బ్యాంక్‌లలో 29 ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.45.56 లక్షలు ఉన్నాయని, వాటిని ఏటేటా రెనివల్ చేస్తున్నామని, అలాగే మరో 17 ఫిక్స్‌డ్ డిపాజిట్ల రెనివల్‌కు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వీటన్నింటికి సంబంధించిన బాండ్ పేపర్లు డిడిఎస్ వద్ద ఉన్నాయని చైర్మన్ సంజయ్ వివరించారు.

డిడిఎస్‌ను కొందరు బదనామ్ చేస్తున్నారని ఆరోపణ
డిడిఎస్ వ్యవస్థాపక సభ్యుడు గోపాల్ సంస్థకు రాజీనామా చేసి సొంతంగా మరో ఎన్జీవో ఏర్పాటు చేసుకున్నారని, ఆయనతో పాటు గతంలో సంస్థలో పని చేసి మానేసిన జయప్ప, జగన్నాథ్‌రెడ్డి తదితరులు డిడిఎస్‌పై లేనిపోని ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని, దాతల నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని చైర్మన్ బిపి సంజయ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News