Sunday, December 22, 2024

డెక్కన్ మాల్ లాంటి భవనాలు 25 వేలు ఉన్నాయి: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: డెక్కన్ మాల్ భవనంలోకి కెమికల్స్ వల్ల మంటలు ఆరలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో డెక్కన్ మాల్ లాంటి భవనాలు 25 వేల వరకు ఉండొచ్చన్నారు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేస్తామన్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని తలసాని దుయ్యబట్టారు. భవనాల క్రమబద్ధీకరణపై స్టే ఉందని కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఉన్న ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు.

డెక్కన్ మాల్‌లో అగ్ని ప్రమాద ఘటనలో బిల్డింగ్ కూల్చే వరకు చుట్టు పక్కల ఇళ్లలోకి ఎవరినీ అనుమతించబోమని, లోపల మృతదేహాల ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తామని వెస్ట్‌జోన్ డిసిపి తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News