Saturday, November 16, 2024

దక్కన్ పీఠభూమి అందాలకు ఫిదా..

- Advertisement -
- Advertisement -

నూతనోత్తేజంతో రాష్ట్ర పర్యాటక రంగం
మన సంస్కృతి,మన సంప్రదాయం, -మన పర్యాటకం
ఎనిమిదేళ్లలో 63.51 కోట్ల మంది దేశీయ పర్యాటకుల సందర్శన
2014 నుంచి రాష్ట్రాన్ని సందర్శించిన 1.35 లక్షల విదేశీ పర్యాటకులు
హరిత హోటల్స్‌తో ఆకట్టుకుంటున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ

మనతెలంగాణ/ హైదరాబాద్ : దక్కన్ పీఠభూమి ప్రకృతి రమణీయత.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు.. రాష్ట్రంలో పర్యాటక రంగానికి నూతనోత్తేజం అందిస్తోంది. రాష్ట్రం నలుమూలలు.. సహజ జలవనరులు, తటాకాలు, కొండలు, కోనలు, కోటలు,ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయంగా నిలిచింది. వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగం ఉమ్మడి పాలనలో నిర్లక్షానికి గురైంది. కనీసం ప్రచారానికి కూడా నోచుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించుకుంటున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులు,అభివృద్ధి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలంగాణను పర్యాటక వేదికగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యo కల్పించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థని నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత టూరిజం హోటల్స్,వే సైడ్ వసతులను కల్పించింది. పర్యాటకానికి అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తున్నది. 31 టూరిజం బస్సులు, 120 బోట్స్ నడుపుతున్నది. గోల్కొండ, వరంగల్ కోటల వద్ద సౌండ్ &లైట్ షోలను నిర్వహిస్తున్నది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్ గా ఈ కోటల కధనాలను, గాత్రాలు, సంగీతం, లైట్ ఎఫెక్ట్ తో ప్రదర్శిస్తున్నారు.

వసతుల కల్పనతో పెరిగిన దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య..

పర్యాటక రంగానికి కల్పిస్తున్న వసతులతో తెలంగాణ పట్ల దేశ, విదేశీ పర్యాటకుల్లో ఆసక్తి పెరిగింది. దేశీయ పర్యాటకం గణనీయంగా వృద్ధి చెందింది. 2014 నుంచి 2022 జూలై వరకు తెలంగాణను 63 కోట్ల 51 లక్షల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. లక్ష 35 వేల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన పనులతో పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది. నాగార్జునసాగర్ వద్ద రూ.65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతరకు రూ.13.43 కోట్లతో పర్యాటక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతులు కల్పించింది. తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత జలపాతం వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు, శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధం వద్ద రూ.5.35 కోట్లు, అక్కమహాదేవి గుహలు వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్ది..

పలు చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తున్నది. కోవిద్ అనంతరం దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. కోట్లాది రూపాయల వ్యయంతో హరిత పేరిట పర్యాటక హోటల్స్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఆధునిక వసతులున్న వాటర్ ఫ్లీట్ బోట్స్, ఏసి,వొల్వా బస్సులను నడుపుతున్నది. రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళ లాడుతున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.

రాష్ట్రాన్ని సందర్శించి దేశీయ, విదేశీ పర్యాటకుల వివరాలు..
నం. సంవత్సరం దేశీయ పర్యాటకులు విదేశీ పర్యాటకులు
1 2014 7,23,99.113 75,171
2 2015 9,45,16,316 1,26,678
3 2016 9,51,60,830 1,66,570
4 2017 8.52,66,596 2,51,846
5 2018 9.28,78 329 3,18,154
6 2019 8,00,35,894 3,23,326

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News