Monday, January 20, 2025

పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్…

- Advertisement -
- Advertisement -

కళా ఆర్ట్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ”ఇలాంటి సినిమాలను మనమంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు బాగా చేశారు. ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నా”అని అన్నారు. డైరెక్టర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ “తెలంగాణ సం స్కృతి ఎంతో గొప్పది, ఇక్కడి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని తెరపై ఆవిష్కరించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. ’దక్కన్ సర్కార్’ ఆడియో లాంచ్ వేడుకను త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో చాణక్య, ఘర్షణ శ్రీనివాస్, హేమ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News