Friday, April 11, 2025

30లోపు నిర్ణయం.. లేదంటే ఒంటరిగానే పోటీ : షర్మిల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టిపి విలీనంపై సోమవారం వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. పార్టీ విలీనంపై ఈ నెల 30వ తేదీలోపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టిపి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలిపారు. ఒకవేళ విలీనం లేకపోతే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసేందుకు వైఎస్సార్‌టిపి సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడ్డవారికి సరైన ప్రాధాన్యత దక్కుతుందని షర్మిల పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News