Tuesday, January 21, 2025

ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీపై త్వరలో నిర్ణయం?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో ఎంసెట్‌లో ఈసారి కూడా ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్‌పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ లోపే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. కొవిడ్ కారణంగా 2020, 2021, 2022లలో ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని తొలగించి.. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయించారు. ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంటుందా..? లేదా..?

అనే అంశంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కరోనా పరిస్థితులతో పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడం, ఇంటర్మీడియేట్‌లో అందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం వంటి కారణాలతో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్ధు చేసింది. అయితే ఈసారి సాధారణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మళ్లీ ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని అమలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంటర్ వెయిటేజీపై స్పష్టత వచ్చిన తర్వాత ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే జెఇఇ మెయిన్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కూడా ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేనందున ఎంసెట్‌లోనూ తొలగించడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News