Wednesday, January 22, 2025

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై సోమవారం నిర్ణయం వెల్లడిస్తాం : టిఎస్‌పిఎస్సీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగులతో ఆందోళనలతో గ్రూప్- 2 పరీక్ష నిర్వహణపై తమ నిర్ణయం సోమవారం వెల్లడిస్తామని టీఎస్ పీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆగస్టు 2 నుంచి 30 వరకు వివిధ పోటీ పరీక్షలు ఉన్నాయని అన్ని పరీక్షల సిలబస్ వేరు వేరుగా ఉండటంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవడం సాధ్యం కాదని దీంతో పరీక్షను వాయిదా వేయాలని కోరారు. దీనిపై టీఎస్ పీఎస్సీ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ ఈ నెల 29,30వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయడం కష్టమని తెలిపింది. అయితే, గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై వచ్చే సోమవారం స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్ పీఎస్సీ కౌన్సిల్ కోర్టుకు తెలిపింది.

దీంతో సోమవారం కచ్చితంగా నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముంగిట్లో ఇది ప్రభుత్వానికి సైతం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతున్నదని అనేది ఉత్కంఠగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News