Sunday, December 22, 2024

కుట్రల డిక్లరేషన్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ రాజ్యాంగ విరుద్ధం

ముస్లింలు, బిసిల మధ్య చిచ్చుపెట్టేయత్నం

ఈ కుట్రలను మైనారిటీలను అర్థం చేసుకోవాలి

ముస్లింలను బిసిలుగా గుర్తిస్తామని డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన హస్తం

ఇదే జరిగితే ముస్లింలు మైనారిటీ హోదా కోల్పోతారు

బిజెపి స్ఫూర్తితోనే కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కల్లోలం సృష్టించడమే వారి లక్ష్యం

పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కోసం ఖర్చు చేసింది రూ.930 కోట్లు

గడిచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ ఖర్చు పెట్టిన మొత్తం రూ.10వేల కోట్లు

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని బిఆర్‌ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు విమర్శించా రు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇంతియాజ్‌తోపాటు పలువురు మైనార్టీ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, మైనారిటీ డిక్లరేషన్ పేరు తో కాంగ్రెస్ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. బిజెపి స్ఫూర్తితో కాం గ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుందని ఎద్దేవా చే శారు. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పు డు వాగ్దానాలు ఇచ్చిందని విమర్శించారు. ముస్లిం మైనారిటీలను బిసిలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలకు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు.

మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బిసిలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు లు రాజ్యాంగపరంగా మతపరమైన మైనార్టీలు అని మం త్రి కెటిఆర్ చెప్పారు. ఆరు నెలల్లో కులగణన చేసి మైనార్టీలతో కలిసి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మై నార్టీ డిక్లరేషన్‌లో పేర్కొందని, దాని ద్వారా మైనార్టీలు, బిసిలు నష్టపోతారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగమే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులను మైనార్టీలుగా గుర్తించినప్పుడు, తలాతోకా లేని కాంగ్రెస్ పార్టీ మైనార్టీల డిక్లరేషన్ తీసుకురావడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు.

ముస్లింలను బిసిలుగా గుర్తిస్తే తర్వాత మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మైనార్టీ కమిషన్, ఇతర మైనార్టీ సంస్థలు ఉండవని చెప్పారు. ఈ ప్రతిపాదన మంచిది కాదు అని, వెంటనే కాంగ్రెస్ పార్టీ తమ మైనార్టీ డిక్లరేషన్‌ను పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బిజెపి ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని కెటిఆర్ ఆరోపించారు. బిజెపి పాస్మందా ముస్లింల గురించి మాట్లాడుతుందని, మైనార్టీల విషయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. టిపిసిసి అధ్యక్షుడిగా ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన వ్యక్తి ఉన్నారని, అందుకే బిజెపి ఐడియాలజీకి అనుగుణంగా కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని విమర్శించారు.

మైనార్టీలను బిసిలలో కలిపితే బిసిలు, మైనార్టీల మధ్య వివాదాలు తలెత్తుతాయని, ఇది ఒక కుట్రలాగా కనిపిస్తుందని ఆరోపించారు. ఈ కుట్రను తెలంగాణ మైనార్టీలు అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు, బలహీనవర్గాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అవసరం లేని బిసి జనగణనలో మైనార్టీలు చేర్చారని అన్నారు. బిజెపి ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఉదయ్‌పూర్‌లో డిక్లరేషన్ అని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు.

కొడంగల్, గోషామహల్, హుజురాబాద్‌లో గెలువబోతున్నాం
కొడంగల్, గోషామహల్, హుజురాబాద్‌లో తామే గెలువబోతున్నామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని పేర్కొన్నారు. కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా..?అని ప్రశ్నించారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని, గోషామహల్‌లో రాజాసింగ్‌ను, హుజురాబాద్‌లో ఈటల రాజెందర్‌ను ఓడిస్తామని చెప్పారు. డిసెంబర్ 3న వెలువడే ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News