Monday, March 31, 2025

కర్నాటకలో ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌ చేయాలి: కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం కొప్పుల మీడియాతో మాట్లాడారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న కారణంగా ఎస్‌సి, ఎస్‌టిలను కాంగ్రెస్ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. గత 50 ఏళ్ల నుంచి ఎస్‌సి, ఎస్‌టిలను కాంగ్రెస్ మాయమాటలతో మోసం చేసిందని, కర్నాటకలో డిక్లరేషన్ చేసి అమలు చేయాలని, అప్పుడు జనం నమ్ముతారన్నారు. దళితులు వృద్ధిలోకి రావాలని తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని, జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాంతీయంగా ఉన్న పార్టీలనే ప్రజలు ఆదర్శిస్తారని కొప్పుల చెప్పారు.

Also Read: లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News