Monday, December 23, 2024

ఆలేరును రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ప్రకటించండి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:రోజురోజుకూ పెరుగుతోన్న ఆలేరు పట్టణ మండలంతో పాటు యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, మోటకొండురు, గుండాల ఆత్మకూరు మండల జనాభాను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ పరిపాలనా సౌలభ్యం కోసం ఆలేరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాన్ని కలుపుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలేరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని శనివారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరడం జరిగింది.

గతంలో ఆలేరును రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ నివేదికతో ప్రభుత్వానికి సమర్పించిన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతము భువనగిరి డివిజన్ 12 మండలాలతో , కాళేశ్వరం ప్రాజెక్టు ల్యాండ్ ఏసిగ్నేషన్ వైటిడిఏ పనులతో పనులతో అసౌకర్యంగా ఉందని , నిత్యం వీఐపీ దర్శనలతో యాదాద్రి దేవస్థానంలో ప్రోటోకాల్ కోసం సమయాన్ని వెచ్చించవలసి వస్తూన్నదని ఆమె తెలిపారు.

వెంటనే పరిపాలన సౌలభ్యం కోసం ఆలేరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు దీంతో అసెంబ్లీలో ఆలేరును రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కోరడంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News