- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి కంటే బాధితుల సంఖ్య పెరిగిందని కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ చర్యలకు ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించాలని కోరారు. అటు ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించాలని చెప్పారు. భారత్ లో గత నాలుగురోజులుగా 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం కరోనా కట్టడిలో విఫలమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విమర్శించారు.
Declare national health emergency Says Congress
- Advertisement -