Monday, January 20, 2025

దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Declining Covid Cases in India

న్యూఢిల్లీ: కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడుతోసహా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతుండగా కేరళ, మిజోరం రాష్ట్రాలలో మాత్రం కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడుతోందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేదని ప్రభుత్వం తెలిపింది. 268 జిల్లాలలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉందని పేర్కొంది. కొవిడ్ వ్యాక్సిన్ డోసుల పెరుగుదల కారణంగా మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వివరించింది. రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్న కారణంగా వైరస్ వ్యాప్తిలో కూడా క్షీణత ఏర్పడినట్లు ప్రభుత్వం తెలిపింది. గత వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుతం వేరియంట్ వల్ల కరోనా రోగులలో విషమ పరిస్థితి, లేదా మరణించే అవకాశాలు తగ్గాయని తెలిపింది. గత వేవ్‌లో కొవిడ్ బారిన పడిన రోగుల సరాసరి వయసు 55 సంవత్సరాలు ఉండగా ప్రస్తుత వేవ్‌లో సరాసరి వయసు 44 సంవత్సరాలు ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News