Tuesday, November 5, 2024

పుట్టినచోట గిట్టుతోందా?

- Advertisement -
- Advertisement -

Declining omicron cases in South Africa

దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్‌లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం

జోహెన్స్‌బర్గ్: గత కొన్నిరోజులుగా దక్షిణాఫ్రికాలో కొవిడ్19 కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఒమిక్రాన్ ప్రభావం ఏమంత తీవ్రంగా లేదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా వైరస్ లేదా వాటి వేరియంట్ల వ్యాప్తి శిఖరస్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తుందన్నది వైరాలజిస్టుల అవగాహన. అదే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత గురువారం దక్షిణాఫ్రికాలో 27,000 కొత్త కేసులు నమోదు కాగా, తాజాగా మంగళవారం ఆ సంఖ్య 15,424కు పడిపోయింది. కోటీ 60 లక్షల జనాభా ఉన్న గౌటెంగ్‌తోపాటు ఆ దేశంలోని అతిపెద్ద నగరం జోహెన్స్‌బర్గ్, రాజధాని ప్రిటోరియాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఒమిక్రాన్ కేసులకు కొన్ని వారాలుగా కేంద్రంగా ఉన్న గౌటెంగ్‌లో కేసులు తగ్గడం, ఇప్పటికే శిఖరస్థాయి చేరుకొని కిందికి దిగుతున్నట్టుగా భావిస్తున్నామని జోహెన్స్‌బర్గ్‌లోని విట్‌వాటర్స్‌ర్యాండ్ యూనివర్సిటీలో అంటువ్యాధులు, వ్యాక్సిన్లపై పరిశోధకురాలైన మార్తానూనెస్ తెలిపారు. ఇది స్వల్ప ఉధృతిగా తేలిందని, సంతోషించదగిన అంశమని ఆమె అన్నారు. నవంబర్‌లో ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడం, ఇప్పుడు అంతే భారీగా తగ్గడం అంచనా వేయలేకపోయామని ఆమె అన్నారు. ఈ వేరియంట్‌తో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య కూడా తక్కువేనని ఆమె తెలిపారు. గౌటెంగ్‌లో నవంబర్ మధ్యలో కేసులు పెరిగిన నేపథ్యంలోనే వైరస్‌ను సీక్వెన్సింగ్‌కు పంపి ఈ వేరియంట్‌ను మొదట అక్కడే గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) నవంబర్ 25న ఒమిక్రాన్‌గా దానికి నామకరణం చేస్తూ ఆందోళన కలిగిస్తోన్న వేరియంట్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి గౌటెంగ్‌లో నమోదైన కేసుల్లో 90 శాతం ఈ వేరియంట్‌వే కావడం గమనార్హం. ఈ వేరియంట్ ఇప్పటికే 89 దేశాలకు విస్తరించిందని డబ్లూహెచ్‌ఒ వెల్లడించింది.

న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీల్లో 57, తెలంగాణలో 38, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా జమ్మూకాశ్మీర్‌లో 3, ఒడిషాలో 2, ఆంధ్రప్రదేశ్, లడఖ్‌ల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఎపిలో కేసుల సంఖ్య 2కు చేరింది. ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. బుధవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6317 కాగా, మరణాల సంఖ్య 318. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 3,47,58,481కి, మరణాల సంఖ్య 4,78,325కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 78,190. ఇది 575 రోజుల కనిష్ఠం. 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 8043. దీంతో,రికవరీ రేట్ 98.40గా నమోదైంది. బుధవారానికి కొవిడ్19 వ్యాక్సిన్ల పంపిణీ 138.96 కోట్లకు చేరింది.

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఢిల్లీలో నిషేధం

ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో క్రిస్మ స్, నూతన సంవత్సర వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించించి. బహిరంగ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీ విపత్తు నిర్వహణ సాధికారసంస్థ(డిడిఎంఎ) తెలిపింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని ఢిల్లీ పాలనా యంత్రాంగంతోపా టు పోలీసులను ఆదేశించింది. రోజువారీగా నివేదికలు సమర్పించాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. మా స్క్‌లు ధరించని వినియోగదారులను అనుమతించొద్దని మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్స్‌ను ఆదేశించింది. మరోవైపు ఒమిక్రాన్‌పై రా ష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వార్‌రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తూ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. సమావేశాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొవిడ్ పరీక్షలను విస్తృతం చేయాలని సూచించింది. అవసరమైనచోట రాత్రి కర్ఫ్యూలు విధించి, కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News